
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపి
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ధూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు సంజన, మేఘన, శ్రావణి, ప్రణతి, సింధు ఎంపికై య్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న విద్యార్థులు 2 నుంచి 4 వరకు జగిత్యాల జిల్లాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపికకు కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ సతీశ్‌ను పలువురు అభినందించారు.
మృతుడి ఆచూకీ లభ్యం
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ధర్మారం గ్రామశివారులో గురువారం లభ్యమైన మృతదేహం ఆచూకీ లభ్యమైంది. మృతుడు మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన రాజుల ఎల్లయ్యగా పోలీసులు నిర్ధారించారు. తూప్రాన్ పట్టణానికి చెందిన ఓ పండ్ల వ్యాపారి వద్ద పని చేస్తున్నాడని, వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో కాపలాగా ఉంచినట్లు గుర్తించారు. 29న మామిడి తోట నుంచి బయటకు వెళ్లి వడదెబ్బ కారణంగా ధర్మారం గ్రామ శివారులోని ఓ చెట్టు వద్ద మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కుక్కల దాడిలో జింక మృతి
నిజాంపేట(మెదక్): కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మండల పరిదిలోని చల్మెడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం కుక్కలు జింకను వెంబడిస్తూ చల్మెడ గ్రామానికి చెందిన రైతు సంతోష్ రెడ్డి మామిడి తోటలోకి ప్రవేశించాయి. గమనించిన రైతు జింకను కుక్కల నుంచి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ జైపాల్ రెడ్డి, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఇంటి ఎదుట పార్కు చేసిన
స్కూటీ దహనం
దుబ్బాకటౌన్: ఇంటి బయట పార్కు చేసిన స్కూటీని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు కథనం మేరకు.. చెల్లాపూర్ వార్డుకి చెందిన రాళ్లపేట శివ దినేశ్ తన స్కూటీని రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఇంటి బయట పార్కు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి బయట పెద్ద శబ్ధం రావడంతో కుటు ంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా స్కూటీ మంటల్లో కాలిపోయింది. కుటుంబ సభ్యులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే స్కూటీని దహనం చేశారని ఆరోపిస్తూ బాధితుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
శామీర్‌పేటలో
తిమ్మాపూర్ వాసి మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామవాసి మేడ్చల్ జిల్లా మండల కేంద్రమైన శామీర్‌పేటలో మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోచంపల్లి హనుమంతు(48) మృతదేహం శుక్రవారం మేడ్చల్ శామీర్‌పేట కట్ట మైసమ్మ ముందు బ్రిడ్జి కింద లభ్యమైంది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు శామీర్‌పేటకు వెళ్లి మృతదేహాన్ని చూసి విలపించారు. హనుమంతు మృతిపై అనుమానం ఉందని విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతికి కాలుకు గాయాలు కావడంతో శామీర్‌పేట పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపి

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపి

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపి

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపి