
నిర్వహణ బరువు ఆహ్లాదం కరువు
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి పట్టణంలోని 10వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొదట్లో చిన్నారులు ఆడుకునేందుకు వస్తువులు, పెద్దలు వాకింగ్, జాగింగ్ చేయడానికి నడక దారి ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో జనంతో వనం కళకళలాడుతుండేది. వృద్ధులు కూడా కొంత సేపు సేదతీరేవారు. పలువురు యోగా సనాలు వేసుకునేవారు. ప్రస్తుతం మాత్రం వనం నిర్వహణ అధ్వానంగా మారింది. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. చుట్టుపక్కల వారు చెత్త వేయడంపాటు పార్కులో ముళ్లపొదలు పెరిగి చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారింది. వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పార్కుకు వచ్చేవారు. కానీ అక్కడ వసతులు లేక అటువైపు చూడటం లేదు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు. వెంటనే అధికారులు పార్కును శుభ్రం చేయించి, చెత్త కుప్పలను తొలగించి పాడైన వస్తువులను బాగు చేయించాలని కోరుతున్నారు.

నిర్వహణ బరువు ఆహ్లాదం కరువు

నిర్వహణ బరువు ఆహ్లాదం కరువు

నిర్వహణ బరువు ఆహ్లాదం కరువు