అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

May 2 2025 4:12 AM | Updated on May 2 2025 2:08 PM

వట్‌పల్లి(అందోల్‌): అను మానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన అందోలు మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్‌, ఏసయ్యకి చెందిన మామిడి తోటను పుల్కల్‌ మండలం సింగూరు గ్రామానికి చెందిన దాసరి సురేశ్‌ (32) లీజుకు తీసుకున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం తోటలో మామిడి చెట్లకు నీరు పట్టేందుకు వెళ్లాడు. సురేశ్‌ చీకటైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భార్య శిరీష గురువారం మామిడి తోటకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పక్కన ఉన్న పొలాల వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త మృతిపై అనుమానంగా ఉందని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూ మరో యువకుడు

మద్దూరు(హుస్నాబాద్‌): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నజీర్‌ కుమారుడు ఇర్ఫాన్‌(20) ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మూడు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో మస్తాసాపానికి గురై 29న ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పింటించుకున్నాడు. తీవ్ర గాయాలైన యువకుడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సంగారెడ్డి పట్టణంలో మహిళ

సంగారెడ్డి క్రైమ్‌: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌ కథనం మేరకు.. పట్టణంలోని మార్చ్‌నగర్‌ కాలనీకి చెందిన చాకలి దశరథ్‌, మాధవి దంపతులు. దశరథ్‌ సంగారెడ్డి మున్సిపాలిటీలో వృత్తిరీత్యా కాంట్రాక్ట్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్ల కిందట మాధవి తన భర్తతో గొడవ తల్లిగారిల్లు కంది మండలంలోని ఇంద్రేశం గ్రామానికి వెళ్లింది. తన దగ్గర ఉన్న బంగారం, డబ్బుతో హోటల్‌ పెట్టింది. తల్లి 3 నెలల కిందట చనిపోయింది. బిజినెస్‌లో నష్టాలు రావడం, తల్లి మరణంతో మనస్తాపానికి గురై 15 రోజుల కిందట భర్త వద్దకు వచ్చి ఉంటుంది. గురువారం దంపతుల మధ్య బంగారం విషయమై గొడవలు జరిగాయి. దశరథ్‌ పనికి వెళ్లి ఇంటికొచ్చేసరికి భార్య ఇంటి ఎదుట గల రేకుల షెడ్డుకు ఉరేసుకొని కనిపించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement