
అవగాహన ఒప్పందంపై సంతకాలు
ములుగు(గజ్వేల్) : ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వ విద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఫౌండేషన్ మధ్య సోమవారం పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ములుగు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్. దండా రాజిరెడ్డి, శ్రీ ఫౌండేషన్ ప్రతినిథి శ్రీనివాస్‌రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతులు, మహిళలు, యువతకు వినూత్న శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా శక్తివంతం చేయడంలో శ్రీ ఫౌండేషన్ దోహదపడుతుందన్నారు. అంతే కాకుండా ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి పరిశోధన ప్రాజెక్ట్‌లు, ఆన్– ఫామ్ ట్రయల్స్, విస్తరణ కార్యకలాపాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్ అనితాకుమారి, వీణాజోషి, తదితరులు పాల్గొన్నారు.