
ఉపాధి అదరగొట్టె
జొన్న రొట్టె..
పోషక ఆహారంపై ప్రజల దృష్టి
● మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం ● మహిళలకు వరంగాజొన్న రొట్టె కేంద్రాలు ● ఒక్కో రొట్టె రూ.15 లెక్కన విక్రయం ● రోజుకు సగటునరూ.500 సంపాదన ● జిల్లా వ్యాప్తంగా సుమారు200 కుటుంబాలకు ఆధారం
తూప్రాన్ మండలం ఘనపూర్‌లో సాగు చేస్తున్న తెల్లజొన్న పంట
తూప్రాన్: జొన్న రొట్టె ఒకప్పుడు పేదల ఆహారం క్రమ క్రమంగా వరి భోజనానికి ప్రజలు అలవాటు పడటంతో జొన్నల కొనుగోలు క్రమక్రమంగా తగ్గిపోయింది. కాలక్రమేణ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతుండటంతో మళ్లీ జొన్న రొట్టెల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో జొన్న రొట్టెల తయారీ కేంద్రాలు పెరిగాయి. పలు గిరిజన మహిళలు వాటిని తయీరు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
మహిళలకు ఉపాధిగా జొన్న రొట్టె..
జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కుంటుంబాలు జొన్న రొట్టె తయారీని ఉపాధిగా మల్చుకున్నారు. ఇందులో గిరిజన మహిళలు అధికంగా కనిపిస్తారు. రోజుకు సగటున రూ.500 సంపాదిస్తున్నారు. రుచి, ఆరోగ్య విలువలు కలగలిసి ఉండటంతో ఇవి రోడ్డు మార్గంలోని ప్రయాణికులను, ఇతర ప్రజానీకాన్ని ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో ఎందరో మహిళలకు ఇది ఉపాధిగా మారింది. తూప్రాన్, మెదక్, చేగుంట, రామాయంపేట, నర్సాపూర్, తదితర రోడ్డు పక్కన తోపుడు బండ్లపై ఇవి లభిస్తున్నాయి. ఈ రొట్టెలను తయారు చేసి విక్రయిస్తూ వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇందులో అనేక గిరిజన తండాలకు చెందిన మహిళలు ఉన్నారు.
జొన్న రొట్టె పోషక విలువల సమ్మేళనం
జొన్న రొట్టెలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. 100 గ్రాముల జొన్న పిండిలో 10.4 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. మానవ శరీరానికి ప్రతి రోజూ అవసరమైన ఫైబర్‌లో 40 శాతం సమకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ బీ, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలం చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడుతాయి. మధుమేహాలకు ఇది చక్కటి ఆహారం.
కడక్.. సాఫ్ట్ రోటీలు
కడక్, సాఫ్ట్ రొట్టెలను అప్పటికప్పుడే సిద్ధం చేసి ఇస్తారు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడవదు. దీనిని సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది.
తయారీ ఇలా..
జొన్న పిండిని కలపడానికి వేడి నీళ్లను ఉపయోగించాలి. నీళ్లు మరిగేటప్పుడు కాస్త నూనె, రుచికి సరిపడా ఉప్పు కలిపితే రొట్టెకు పగుళ్లురావు. కలిపిన పిండి ముద్దపై పది నిమిషాలు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. వీటిని చపాతీ కర్రతో కాకుండ చేత్తో చేస్తేనే చక్కగా వస్తాయని రొట్టెలు తయారు చేసే మహిళలు చెబుతున్నారు. కాగా కొందరు యంత్రాల సహాయంతో వివిధ రకాలు, మొక్కజొన్న. తెల్లజొన్న, రాగిజొన్న, గోధుమ రొట్టెలు తయారు చేస్తూన్నారు.
యంత్రంతో క్షణాల్లో రొట్టెలు
నా పేరు కవిత. మాది తూప్రాన్. రొట్టెల తయారీ కోసం అప్పు చేసి రూ.3 లక్షల వ్యయంతో యంత్రం కొనుగోలు చేశాను. యంత్రం ద్వారా రొట్టెలతో పాటు వివిధ రకాల పిండి వంటలు చేస్తున్నాను. జొన్నరొట్టె, మొక్కజొన్న రొట్టె, రాగి జొన్నరొట్టె, గోధుమ రొట్టెలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నెలకు ఖర్చులు పోను రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తుంది. దీనిద్వారా ఉపాధి లభిస్తుంది.
– కవిత, రొట్టెల తయారుదారు, తూప్రాన్
వ్యాయామం.. సమతుల ఆహార లోపం
వ్యాయామం, సమతుల ఆహారం మానవుడికి ఆరోగ్యాన్ని పంచుతాయి. అవి కొరవడటంతో ఊబకాయులు పెరిగిపోతున్నారు. మితిమీరిన ఆహారం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. ఊబకాయం అందరినీ వేధిస్తున్న సమస్యగా మారింది. దీంతో మంచి ఆరోగ్యానికి వాకర్స్, ఊబకాయులు, మధుమేహం ఉన్న వాళ్లు జొన్న రొట్టెలను జోరుగా విక్రయిస్తున్నారు.

ఉపాధి అదరగొట్టె

ఉపాధి అదరగొట్టె

ఉపాధి అదరగొట్టె

ఉపాధి అదరగొట్టె

ఉపాధి అదరగొట్టె