
పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
● ఇంట్లో చెప్పకుండా 2014లో వెళ్లిపోయిన యువకుడు ● అప్పటి నుంచి వెతుకుతున్న తల్లిదండ్రులు ● వారం కిందట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ● సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్న పోలీసులు ● అమ్మానాన్నలకు భారం కావొద్దని వెళ్లానంటున్న తే జసాయి
మెదక్ మున్సిపాలిటీ: తల్లిదండ్రులకు భారం కావొద్దని, సొంతంగా డబ్బులు సంపాదించి ఇంటికొస్తానని లక్ష్యంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన యువకుడు 11 ఏళ్ల తర్వాత దొరికాడు. దీంతో ఎప్పటికై నా తమ కుమారుడు ఇంటికొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెల్లు విరిసింది. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన కూనమనేని శారద–శ్రీనివాస్‌రావు కుమారుడు కూనమనేని తేజసాయి హైదరాబాద్‌లోని డీఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం 2014లో చేశాడు. తల్లిదండ్రులపై భారం కావద్దన్న ఉద్దేశ్యంతో 7 సెప్టెంబర్ 2024లో ఎవరికీ ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎక్కడా వెతకినా ఆచూకీ లభించలేదు. పదకొండేళ్లు గడిచిపోయినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో 3న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. తేజ సాయి పేరు మార్చుకోకుండా అదేపేరుతో కొనసాగుతుండటం కేసు త్వరగా ఛేదించేందుకు దోహదపడింది. అతడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట నమోదైన మిస్సింగ్ కేసును త్వరగా మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్‌ను ఎస్పీ అభింనందించారు.
ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే..
జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయానని, బెంగుళూరులో ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నట్లు తేజ సాయి చెప్పాడు. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఆర్థికంగా ఎదిగాడు. తల్లిదండ్రులపై ఆధార పడకుండా ఏదైనా సాధించాలన్న ఉద్దేశ్యంతో వెళ్లానని, ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే ఇరవై ఏళ్లకు వస్తానని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..