విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న అధికారులు
నారాయణఖేడ్: ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నాగల్‌గిద్ద మ ండలం గోందేగాంకు చెందిన మాజీ సర్పంచ్ శంకరప్పతోపాటు శాంతయ్యస్వామి ఆదివా రం నారాయణఖేడ్‌కు బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
రేపు మంత్రి
హరీశ్‌రావు రాక
సంగారెడ్డి టౌన్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్ రావు మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నందున ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ సురేష్ మోహన్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దేవుజా, మున్సిపల్ కమిషనర్, నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి శుభాకాంక్షలు
సంగారెడ్డి టౌన్: వినాయక చవితి పండుగ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు. విఘ్నేశ్వరుడి కృపతో విఘ్నాలు తొలగి అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవనం సాగించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులకు విద్యాశాఖలో విలీనం చేయాలి
సంగారెడ్డి టౌన్: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శేషాద్రి అన్నారు. జేఏసీ కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు దత్తు, నరేశ్, రాజు ధనలక్ష్మి, శిరీష పాల్గొన్నారు.
ఘనంగా విశ్వకర్మ జయంతి
సంగారెడ్డి టౌన్: విరాట్ విశ్వకర్మ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి జగదీశ్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారి సంక్షేమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, విశ్వకర్మ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు
కలెక్టర్ శరత్


