పాముకాటుతో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలుడి మృతి

Apr 29 2023 1:20 AM | Updated on Apr 29 2023 1:38 PM

- - Sakshi

మెదక్: ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఓ బాలుడిని పాము కాటేసింది. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గబ్బర్‌ సింగ్‌–సునీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. గబ్బర్‌సింగ్‌ది మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి తండా స్వస్థలం కాగా, భార్యపిల్లలను వారి పుట్టినిల్లయిన జలాలార్‌పూర్‌ తండాలో ఉంచి బతుకుదెరువుకు వలస వెళ్లాడు.

సునీత తండ్రి చందర్‌ ఇటీవల ఇంటినిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో పక్కనే ఉన్న మరో ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం అర్ధరాత్రి కరెంటుపోయింది. ఉక్కపోతగా ఉండడంతో తల్లితోపాటు చిన్నకుమారుడు అక్షయ్‌(5) ఇంటి వరండాలో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల ప్రాంతంలో అక్షయ్‌ని పాముకాటు వేసింది. గమనించిన కుటుంబసభ్యులు ముందుగా అంసాన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడి ఆర్‌ఎంపీ సూచన మేరకు మెదక్‌ తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement