● ‘విమోచనం’లో మనం | - | Sakshi
Sakshi News home page

● ‘విమోచనం’లో మనం

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

● ‘విమోచనం’లో మనం ప్రియుడితో వెళ్లిన వివాహిత అనుమానాస్పద మృతి ఇబ్రహీంపట్నం రూరల్‌: భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి ఉంటున్న వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన కందిమళ్ల శ్యామల కుమార్తె కల్యాణి (38)కి, అదే జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రావుతో 2007లో వివాహమైంది. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ వద్ద నివసిస్తుండగా 2016లో కల్యానికి దాసరి నర్సింహమూర్తి (35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో కుటుంబాన్ని వదిలేసిన కల్యాణి 2018లో నర్సింహమూర్తితో వెళ్లిపోయింది. ఈవిషయమై అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు వచ్చింది. మళ్లీ 2026 ఫిబ్రవరి 12న భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నాదర్‌గుల్‌ సమీపంలో వీరు ఉంటున్న అద్దె ఇంట్లో కల్యాణి మంచంపై శవమై పడిఉంది. మెడపై గీతలు, గాయాలు ఉన్నట్లు పోలీసులు గమనించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నర్సింహమూర్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తెలంగాణ విమోచన, సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లాకు చెందిన పలువురు చురుకై న పాత్ర పోషించారు. నిజాం నిరంకుశ పాలనపై గొంతెత్తి చాటారు. వీరోచిత పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపారు. రజాకార్ల చేతిలో అనేక మంది అమరులయ్యారు. వికారాబాద్‌ పట్టణం గాంధీ కాలనీకి చెందిన దొండేరావ్‌ జాదవ్‌ దేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. వారి నిరంకుశ పాలన, అరాచకాలను ప్రజలకు వివరించారు. దీంతో 1947 సెప్టెంబర్‌ 17న ఆయన్ను అరెస్టు చేసి కర్ణాటకలోని గుల్బర్గా జైలులో ఉంచారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారత ప్రభుత్వం ఆయన్ను 1948 సెప్టెంబర్‌ 17న విడుదల చేసింది, తామ్రపత్రంతో సత్కరించింది. వికారాబాద్‌లో ఆయన పేరిట శిలాఫలకం ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన నారాయణస్వామి కూడా అలుపెరగని పోరాటం చేశారు. ఇలా ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంగానే తెలంగాణ భారతదేశంలో విలీనమైంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విలీన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరిట కార్యక్రమాలు జరపాలని నిర్ణయించింది. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

– వికారాబాద్‌

సభకు హాజరైన జనం

మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

సాయుధ పోరాట యోధులకు

కమ్యూనిస్టులే వారసులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

జాన్‌వెస్లీ

ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ

చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీపై ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement