అనంతగిరి: కలెక్టరేట్‌లో ప్రతిష్ఠించిన గణనాథునికి బుధవారం ఉదయం కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృత అభిషేకం, అర్చన నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, డీఆర్‌ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఇతర అధికారులు


