మొయినాబాద్‌రూరల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలంలోని చిన్నమంగళారంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన రైతు రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, పెట్టుబడి సహాయం రిజిస్ట్రీ ఉంటేనే అందుతాయని తెలిపారు. వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదై ఉండాలన్నారు. గ్రామాల్లో ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్‌రావు, తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఎంపీడీవో హిమబిందు, మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ తలారి లక్ష్మిబాలయ్య, ఉపసర్పంచ్ అంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


