అబ్దుల్లాపూర్‌మెట్: వచ్చే వర్షాకాలంలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఆర్‌డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని కవాడిపల్లిలో గురువారం సర్పంచ్ కొలన్ ప్రసన్నరవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఎంపీడీఓ శ్రీవాణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. గ్రామాల్లో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో తాగునీటి పరిశుభ్రత, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ శ్రీలత


