గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందాం | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందాం

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

కందుకూరు: పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుందామని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక సర్పంచ్‌ సరికొండ పాండు, ఎంపీడీఓ సరిత ఆధ్వర్యంలో కందుకూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. చెత్తను వేరు చేసి అందించే బాధ్యతను మహిళలు తీసుకోవాలని అన్నారు. ఆ విషయంలో అందరినీ చైతన్యం చేసేలా మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సౌడపు మమతవెంకటేశ్‌గౌడ్‌, ఎస్‌ఐ పరమేష్‌, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌, మండల వైద్యాధికారి డాక్టర్‌ హుమేరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement