కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కుర్మిద్దలో గ్రామసభ బహిష్కరణ

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు గురువారం యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో జరిగాయి. యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో సర్పంచ్‌ శ్రీవిద్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఫార్మా రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయం చేసుకుంటుంటే అధికారులు విద్యుత్‌ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు స్పందించాలని పట్టుబట్టారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రభుత్వం నిర్వహించే సభలు తమకు అవసరం లేదని, సమస్య తీర్చే వరకు సభ వాయిదా వేయాలని సర్పంచ్‌ సైతం భీష్మించారు. గ్రీన్‌ఫార్మా సీఐ సత్యనారాయణ జోక్యం చేసుకున్నా రైతులు వినలేదు. దీంతో చేసేదేమి లేక వాయిదా వేశారు. గున్‌గల్‌ గ్రామంలో ప్రత్యేకాధికారి మాధవరావు, సర్పంచ్‌ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

ఇబ్రహీంపట్నంలో ప్రశాంతం

ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, నాగన్‌పల్లి, ఉప్పరిగూడ, పోచారం, కప్పపహాడ్‌, ఎల్మినేడు, తులేకలాన్‌ గ్రామాల్లో సభలు ప్రశాంతంగా జరిగాయి. అధికారులు, సర్పంచ్‌లు పాల్గొని గ్రామ అభివృద్ధిపై మాట్లాడారు.

పొలాలకు విద్యుత్‌ కట్‌ చేశారని నిలదీత

Advertisement
 
Advertisement
Advertisement