ఒకరి మృతి, మరొకరికి గాయాలు
షాద్‌నగర్‌రూరల్: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కార్తీక్(19) తన స్నేహితుడు శ్రీనాథ్‌ను షాద్‌నగర్‌లో వదిలిపెట్టేందుకు బైక్‌పై వెళుతున్నారు. లింగారెడ్డిగూడ శివారులో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోకుండా లారీని రోడ్డుపై నిలిపారు. రాత్రి సమయం కావడంతో ముందు లారీ నిలిపిన విషయాన్ని గమనించకపోవడంతో బైక్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కార్తీక్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుశీల తెలిపారు.
ఏఎంసీ సూపర్‌వైజర్‌గా నవనీత
బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) సూపర్‌వైజర్‌గా నవనీత గురువారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమెను.. అధికారులు బషీరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. అక్రమ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కాశీంపూర్ సమీపంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి సిద్దమ్మ, సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు.


