మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

బేడ బుడగ జంగం సంఘానికి స్థలం విరాళం

షాద్‌నగర్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత ప్లాటును ఓ సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేసి షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఉదారతను చాటారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బేడ బుడగ జంగం సంఘానికి ఎమ్మెల్యే చేగూరు రోడ్డులోని విశ్వసాయి వెంచర్‌లో తనకున్న 120 చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి దస్తావేజు పత్రాలను సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ రూ.లక్షలు విలువ చేసే సొంత ప్లాటును సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉదారతను చాటిన ఎమ్మెల్యేకు సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తూర్పాటి వెంకటేష్‌, సభ్యులు ముత్యాలు, ఊషయ్య, యాదయ్య, పెంటయ్య, నర్సింలు, జంగయ్య, బాలకృష్ణ, అంజయ్య, పెంటయ్య, యాదయ్య, రామస్వామి, స్వామి, మేగలయ్య, దశరథ్‌, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement