అదనపు కోర్టు భవనానికి వినతి | - | Sakshi
Sakshi News home page

అదనపు కోర్టు భవనానికి వినతి

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

అదనపు కోర్టు భవనానికి వినతి

ఆమనగల్లు: పట్టణంలో నూతనంగా అదనపు కోర్టు భవనం నిర్మించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్‌ను ఆమనగల్లు బార్‌ అసోసి యేషన్‌ సభ్యులు కోరారు. బుధవారం హైదరాబాద్‌ లోని జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్‌ను ఆమనగల్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదీలాల్‌ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించారు. ఆమనగల్లులో కోర్టు భవనం నిర్మించాలని, సీనియర్‌ కోర్టు ను షాద్‌నగర్‌ నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి తరలించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఆమనగల్లు బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు శేఖర్‌, గ్రంథాలయ కార్యదర్శి గణేశ్‌గౌడ్‌, క్రీడా కార్యదర్శి సంతోశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement