కడ్తాల్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి ఖాలేధ్, రోషిణి జైస్వాల్‌కు కడ్తాల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు కష్టపడి చదివిన విద్యార్థులు పేపర్ లీకేజీ ఘటనతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో నీట్ పరీక్ష గుణపాఠంతోనూ కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగితే యూత్ కాంగ్రెస్ సహించదని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజల నుంచి దోచుకుని అదానీ, అంబానీలకు కట్టపెడుతున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. అనంతరం మైసిగండి మైస మ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, నాయకులు షాబుద్దీన్, బోసు రవి, భానుకిరణ్, శ్రీకాంత్, ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్


