వైద్యారోగ్యశాఖలో బదిలీలపై సమగ్ర విచారణకు ఆదేశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్యారోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి తుది నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపై రెండు రోజుల క్రితం ‘సాక్షి’జిల్లా ఎడిషన్‌లో ‘స్థాన చలనం లేదు’శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్ దృష్టి సారించారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థుల అడ్మిషన్ల ఫైళ్లు తొక్కి పెట్టడంపై సీరియస్ అయ్యారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా ఆదేశించినట్లు తెలిసింది.
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 92 మంది ఖైదీలకు క్షమాభిక్షపై విడుదల చేసింది. ఇందులో చింతపట్లకు చెందిన ఇద్దరు ఖైదీలు ఇంటికి చేరుకున్నారు. యాచారం మండలం చింతపట్లకు చెందిన కొండ మహిపాల్‌రెడ్డిని హత్య చేసిన కేసులు అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవించి ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షలో విడుదలై స్వగ్రామానికి చేరుకున్నారు. బుధవారం వారు యాచారం పోలీసులను కలవడంతో ప్రశాంతంగా జీవితాలను గడపాలని సూచించారు.
● అధికారుల పనితీరు మార్చుకోవాలి
● అదనపు కలెక్టర్ కిరణ్మయి
చేవెళ్ల: ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధికారులు అందుబాటు లో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాలలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీపీఓ సురేశ్‌మోహన్, డీఆర్‌డీఏ అదన పు పీడీ సుభాషిణి, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలో చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం పల్లె ప్రకృతివనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పై అధికారులు స్పందించాలన్నారు. పలుశాఖ ల అధికారుల తీరుపై ఫిర్యాదులు ఉన్నాయని వాటిని సరిచేసుకోవాలన్నారు. అధికారులు, సి బ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య, ఎంపీడీఓ బన్సీలాల్, సర్పంచ్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఉప సర్పంచ్ జంగారెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


