మహనీయుల ఆశయ సాధనకు బస్సుయాత్ర | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయ సాధనకు బస్సుయాత్ర

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

మహనీయుల ఆశయ సాధనకు బస్సుయాత్ర

నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లురవి

ఆమనగల్లు: మహానీయుల చరి త్ర, త్యాగాలు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. మైసిగండిలో ప్రారంభించిన మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యా త్ర బుధవారం ఆమనగల్లుకు చే రుకుంది. ఈ యాత్రకు స్వాగతం పలికిన ఆయన మాట్లాడుతూ.. మహానీయుల జీవితగాధలు ప్రతీ ఒక్కరు తెలుసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. దేశంలో అనగారిన వర్గాల అభివృద్ధి కోసం, సమాజంలో మార్పుకోసం కృషి చేసిన మహానీయులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. మహానీయుల జీవిత చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకత, ఓటు విలువ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజక వర్గంలోని 46 మండలాలు, వెయ్యి గ్రామాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు.

మహిళల అభివృద్ధికి పెద్దపీట

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్ననే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బుధవారం ఎంపీ రవి కడ్తాలలో ఆర్టీసీ బస్సులో ఎక్కి ఆమనగల్లు వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ప్రాధాన్యతకు పెద్దపీట వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు పూర్తి వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, మండల అధ్యక్షుడు జగన్‌, మండ్లి రాములు, నాయకులు మల్లయ్య, ఫరీద్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement