తిమ్మాపూర్‌కు ట్రైనీ ఐఈఎస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

తిమ్మాపూర్‌కు ట్రైనీ ఐఈఎస్‌ అధికారులు

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

తిమ్మాపూర్‌కు ట్రైనీ ఐఈఎస్‌ అధికారులు

కందుకూరు: ఎన్‌ఐఆర్డీలో శిక్షణ పొందుతున్న 2025 సంవత్సరానికి చెందిన ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌) బ్యాచ్‌ ట్రైనీలు బుధవారం మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో పర్యటించారు. గ్రామ పంచాయతీని సందర్శించి పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాలను గురించి పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌, సర్పంచ్‌ అంజమ్మను అడిగితెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఉపాధిహామీలో నిర్మించిన పాంపండ్స్‌తో పాటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న యూనిట్లను పరిశీలించారు. సంఘంలో మహిళలు చేరి ఎలా లబ్ధిపొందుతున్నారో అడిగితెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఉప సర్పంచ్‌ సన్నిళ్ల సంధ్య, ఏపీఓ రవీందర్‌రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శ్రీలత, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement