కొనుగోలు చేసిన పంటలను తరలించేందుకు వాహనాలను కేటాయించాలని అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఒకే ట్రాన్స్‌పోర్టును కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేర్వేరు ట్రాన్స్‌పోర్టులకు కేటయించాలి.
– శ్రీధర్‌రెడ్డి,
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేశంపేట
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని మక్కలను విక్రయించేందుకు వచ్చాం. నాలుగు రోజులుగా కొనుగోలు చేపట్టక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి.
– యుగంధర్, కేశంపేట


