గుట్కాల విక్రేతపై కేసు | - | Sakshi
Sakshi News home page

గుట్కాల విక్రేతపై కేసు

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

గుట్కాల విక్రేతపై కేసు

చేవెళ్ల: నిషేధిత గుట్కాలు, పాన్‌మసాలా, టొబాకో ఉత్పత్తులు నిల్వ చేసిన దుకాణంపై పోలీసులు దాడి చేసి యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ నిల్వలను సీజ్‌ చేశారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్‌ తెలిపిన ప్రకారం.. మండలకేంద్రంలోని బాలాజీ జనరల్‌ స్టోర్‌లో గుజరాతి ఎల్లప్ప నిషేధిత గుట్కా, పాన్‌మసాల, టొబాకో ఉత్పత్తులు నిల్వచేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి సిబ్బందితో కలిసి బాలాజీ జనరల్‌ స్టోర్‌పై దాడులు చేశారు. ఈదాడుల్లో స్టోర్‌లో పెద్ద మొత్తంలో నిషేధిత పాన్‌మసాలాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని సీజ్‌చేసి ఎల్లప్పపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, ఆనంద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement