ఇబ్రహీంపట్నం: స్కూటీ అపహరణకు గురైన ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిఽధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో నివాసముండే గగనమోని సత్యనారాయణ తన ఇంటి ఎదుట స్కూటీని మంగళవారం రాత్రి పార్కు చేశాడు. బుధవారం ఉదయం చూసేవరకు వాహనం కలినిపించలేదు. దీంతో బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరో బైక్ స్థానిక బస్టాండ్ వద్ద అపహరణకు గురైనట్లు సమాచారం.
ఆటోలు దొంగకు రిమాండ్
మొయినాబాద్: ఆటోలు చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. నగరంలోని చందానగర్ పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన వడ్డె వెంకటేశ్ ఆటో డ్రైవర్. గత నెల 27న మొయినాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఓ ఆటో, అజీజ్‌నగర్ సమీపంలో మరో ఆటోను చోరీ చేశాడు. పోలీసులు బుధవారం సురంగల్ బైపాస్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా వెంకటేశ్ ఆటోలో ప్రయాణిస్తున్నాడు. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా రెండు ఆటోలతో పాటు సదాశివపేటలో ఓ బైక్ సైతం చోరీ చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడు గతంలో ఆటో, ఇంటి దొంగతనం, పొక్సో కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
షాద్‌నగర్: గ్రేడ్–1 శాఖా గ్రంథాలయ నూతన లైబ్రేరియన్‌గా వెంకటయ్య బదిలీపై షాద్‌నగర్‌కు వచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటయ్యను గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్కబాల్‌రాజ్, వీరేశ్, ప్రధాన కార్యదర్శి క్యూసెట్ శ్రీనివాస్, జూపల్లి చంద్రశేఖర్, కత్తి చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు.


