ఇబ్రహీంపట్నం: పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొంకణి విజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం శాఖ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.
పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా జగన్
మొయినాబాద్: టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన రాచమల్ల జగన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ సమక్షంలో టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. రాష్ట్రంలో పార్టీ విస్తరకు కృషి చేస్తానన్నారు.


