షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 165 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొని వంద మంది విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు.
మూన్‌రే కళాశాలలో..
రాయికల్ శివారులోని మూన్ రే కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్ధ దివీస్ ల్యాబొరెటరీస్ నిర్వహించిన నియామక ప్రక్రియలో కళాశాలకు చెందిన 23 మంది బిఫార్మసీ విద్యార్థులు ఎంపికై నట్లు వారికి రూ.3.20లక్షల వార్షిక వేతనంతో కూడిన ప్యాకేజీతో ఉద్యోగాలు పొందినట్లు కళాశాల చైర్మన్ పర్వత్‌రెడ్డి తెలిపారు.
శిక్షణకు వంద మంది విద్యార్థులు


