షాబాద్: రైతులకు పశుగ్రాస విత్తనాల పంపిణీ చేసినట్లు శాస్త్రవేత్త, క్రీడా కేవీకే డాక్టర్ సుధీర్, బసేరా డైరెక్టర్ డాక్టర్ అంజు తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పశుగ్రాస క్షేత్రము(ఆర్‌ఎఫ్‌ఎస్)హైదరాబాద్ క్రీడా కేవీకే, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుగ్రాస విత్తనాల ఎంపిక, పాల పశువుల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక పాల ఉత్తత్తి, మాంస ఉత్పత్తి పెరుగుదలకు నాణ్యమైన పశుగ్రాసం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పాల పశు సంరక్షణ విధానాలు, శాసీ్త్రయ డెయిరీ నిర్వహణ, గొర్రెల పెంపకంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. 40 మంది రైతులకు ముల్గి పశుగ్రాస కట్టింగ్స్, అధిక దిగుబడి ఇచ్చే సీఓఓఫ్‌ఎస్–29 మల్టీకట్, మల్టీ ఇయన్ జొన్న పశుగ్రాస విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపల్లి రత్నాకర్, సర్పంచ్ సబితాగోవర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్ మాణిక్యం, కేవీకే శాస్త్రవేత్తలు దిలీప్ రామకృష్ణ, గొర్రెల కాపరులు, రైతులు తదితరులు ఉన్నారు.


