మొయినాబాద్‌రూరల్: ఉద్యోగరీత్యా అధికారులకు బదిలీలు సహజమని ఫిషర్‌మెన్ జిల్లా చైర్మన్ మహేందర్‌ముదిరాజ్ అన్నారు. కేతిరెడ్డిపల్లి క్టస్టర్ విస్తీర్ణ అధికారి ఎ.కుమార్ స్థానంలో శ్రీనివాస్, మొయినాబాద్ క్లస్టర్ ఎన్.సునీల్ కుమార్ స్థానంలో ఇ.వీణ బుధవారం మొయినాబాద్ రైతు వేదికలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన, కొత్తగా వచ్చిన అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మ హేందర్‌ముదిరాజ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, ప్రభుత్వ పథకాలు, విత్తనాలు, ఎరువులు, పంటలన నిర్వహణ తదితర విషయాల్లో సహకరించాలని సూచించారు. రైతుల సౌకర్యార్ధం గతంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ నంబర్లు యధావిధిగా ఉంటాయని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సేవలు, సాంకేతిక సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి, నా యకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఫిషర్‌మెన్ జిల్లా చైర్మన్ మహేందర్‌ముదిరాజ్


