హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్‌లోని రైతు బజార్‌లో కూరగాయల ధరలు (కిలో.. రూపాయల్లో).. టమాట 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 40, కాకర 45, బీర 35, కాలిఫ్లవర్ 18, క్యాబేజీ 18, క్యారెట్ 39, దొండ 23, ఆలు 17, ఉల్లిగడ్డ 20, గోకర 28, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్‌రూట్ 25, కీర 40, ఫ్రెంచ్‌బీన్స్ 65, క్యాప్సికం 55.
తుక్కుగూడ: రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ దర్శనానికి మంగళవారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయం ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యానారాయణ స్వామి వత్రాలు చేశారు. నాగ దేవతకు పుట్టలో పాలు పోశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ మోహన్‌రావు, పాలక మండలి సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: ఐకేపీ వీఓఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 16 రోజులుగా చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు వీఓఏలు ప్రకటించారు. ఈమేరకు వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలు ఎం.సరస్వతి ఆధ్వర్యంలో మంగళవారం ఏపీఎం సత్యనారాయణకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు పత్రం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించామన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా పని చేసే వరకు ఆన్‌లైన్ పనులు, పుస్తకాల ఆడిట్ చేయించమన్నారు. కార్యక్రమంలో వీఓఏలు పాల్గొన్నారు.
కందుకూరు: విద్యార్థుల కోసం ఉత్తమ వేసవి శిబిరం నిర్వహించినందుకుగాను మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్‌కు ప్రశంసాపత్రం లభించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ విష్ణుప్రియకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. వేసవి శిబిరం విజయవంతంగా నిర్వహించేలా మమ్మల్ని ప్రోత్సహించిన అప్పటి డీఈఓ సుశీంధర్‌రావు, ఎంఈఓ నర్సింహ, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం శ్రీనివాస్‌శర్మ, సర్పంచ్ స్వాతిరామకృష్ణారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం
మొయినాబాద్‌రూరల్: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సన్మానించారు.


