కందుకూరు: కొనుగోలు కేంద్రంలోనే తమ పంటను విక్రయించి రైతులు లబ్ధి పొందాలని పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఆధ్వర్యంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే తమ పంటలను విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాళ్లకు రూ.7,721 చొప్పున కొనుగోలు చేస్తున్నామన్నారు. అందరి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడానికి అనుమతులు వచ్చాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్.శేఖర్‌రెడ్డి, ఎన్.నర్సింహ, జి.పర్వతాలు, కె.యశోధ, టి.జగదీశ్వర్‌రెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, పి.ఆనంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మన్నే జయేందర్‌ముదిరాజ్, కె.రామకృష్ణారెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, టి.ఇందిరదేవేందర్, దామోదర్‌గౌడ్, శేఖర్‌గుప్తా, పరంజ్యోతి, జయమ్మరాజు, డి.జంగయ్య, డి.గణేష్, ఎన్.అంజిరెడ్డి, రామకృష్ణ, సంజీవరెడ్డి, వెంకటేష్, ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సీఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


