మహేశ్వరం: మండల సర్పంచ్‌ల సంఘం నూతన అధ్యక్షుడిగా ఉప్పుగడ్డ తండా గ్రామ సర్పంచ్ నేనావత్ రాజు నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల పరిధిలోని ఘట్టుపల్లి గ్రామంలో ఓ రిసార్ట్‌లో పలు గ్రామాల సర్పంచ్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజునాయక్, ఉపాధ్యక్షుడిగా వినోద్‌నాయక్, ప్రధాన కార్యదర్శులుగా మల్లేష్ ముదిరాజ్, దార నర్సింహలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం తాను రాజకీయాలకు అతీతంగా పని చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా తాను సర్పంచ్‌ల సంక్షేమం కోసం పని చేస్తామన్నారు. తనను అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 16 మంది గ్రామ సర్పంచ్‌లు ఎన్నుకున్నారన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.
సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా రాజునాయక్


