భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం | - | Sakshi
Sakshi News home page

భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం

మీర్‌పేట: భారతి అల్ట్రాఫాస్ట్‌ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సాహెర్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లోని శ్రీ లక్ష్మీ స్టీల్‌ ట్రేడర్స్‌ డీలర్స్‌ షాపులో తాపీ మేసీ్త్రలతో జరిగిన సమావేశానికి సాహెర్‌ హాజరై మాట్లాడారు. సిమెంటు వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్‌ అల్ట్రాఫాస్ట్‌ పేరుతో ఫాస్ట్‌ సెట్టింగ్‌ సిమెంట్‌ 5స్టార్‌ గ్రేడ్‌ తెలంగాణలో అందిస్తుందని వివరించారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపికని అన్నారు. అల్ట్రాఫాస్ట్‌ వినియోగదారులకు స్లాబ్‌ కాంక్రీట్‌ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్‌ ఇంజినీర్లు సైట్‌ వద్దకే వచ్చి ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తారన్నారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌ రూ.20 అదనంగా ఉంటుందన్నారు. డీలర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ భారతి సిమెంట్‌ నాణ్యతతో పాటు నిర్మాణ సమయంలో సర్వీస్‌ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని తెలిపారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు.

సంస్థ టెక్నికల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సాహెర్‌

Advertisement
 
Advertisement
Advertisement