సీసీ రోడ్డు పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

షాబాద్‌: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్‌ శ్రీశైలం యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ భరత్‌, వార్డు సభ్యులు మహేందర్‌, నవీన్‌, యాదయ్య,శేఖర్‌, గ్రామస్తులున్నారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్‌స్టేషన్‌ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్‌, అర్గానో ఆలూరు, అర్బన్‌ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్‌ అధికారులకు సహకరించాలని కోరారు.

మహనీయుల సేవలు చిరస్మరణీయం

షాబాద్‌: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, వారు చేసిన సేవలు చిరస్మరణీయమని మండలంలోని సంకెపల్లిగూడ సర్పంచ్‌ కుమ్మరి లావణ్య చెన్నయ్య పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మేరా గావ్‌, మేరీ జిమ్మేదారి స్వచ్ఛగామ్‌, సురక్షిత్‌ జలవాయి–2026 కార్యక్రమంలో భాగంగా తడి చెత్త ద్వారా ఎరువు తయారీ కేంద్రం వద్ద సర్పంచ్‌ కుమ్మరి లావణ్యతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య గ్రామస్తులు సెల్ఫీలు దిగారు.

అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం

మొయినాబాద్‌రూరల్‌: తెలంగాణ ఏర్పాటులో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చాకలిగూడలో ఉద్యమంలో మహేశ్‌ తెలంగాణ ఏర్పడదని ఆలోచనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన భార్య రజితకు 2014లోనే ప్రభుత్వం అటెండర్‌ ఉద్యోగం కల్పించిదన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో రజితను మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి సన్మానించారు.

పంచాయతీ కార్మికులకు సన్మానం

మొయినాబాద్‌రూరల్‌: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్‌ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు అనితరెడ్డి, కార్యదర్శి తారాబాయి, వార్డు సభ్యుడు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

మొయినాబాద్‌రూరల్‌: మండలంలో బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది స్థానంలో ఇతరులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఎంపీడీఓ హిమబిందు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని అందులో ఐదుగురు మొయినాబాద్‌ మండలానికి వెళ్లారన్నారు. కాశీంబౌలిలో పని చేసిన శివకుమార్‌ బదిలీ కావడంతో ఆయన స్థానంలో శంషాబాద్‌ మండలం మదనపల్లి తండా నుంచి శ్రీకాంత్‌, నాగిరెడ్డిగూడ యాదయ్య స్థానంలో ప్రవీణ్‌కల్యాణ్‌, కుతుబుద్దీన్‌గూడ స్వప్న స్థానంలో ఎల్లయ్య వచ్చారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement