ప్రొటోకాల్‌ పాటించలేదంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ పాటించలేదంటూ ధర్నా

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

కొందుర్గు: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సర్పంచ్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రేగడిచిల్కమర్రి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సర్పంచ్‌ శ్వేతకు సమాచారం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరురాలిని అవమానించారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్వేత, మాజీ వైస్‌ ఎంపీపీ రాజేష్‌పటేల్‌, నాయకులు రామకృష్ణ, రవీందర్‌ రెడ్డి, శ్రీనివాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేక..

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ మండలశాఖ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాల ప్రవేశం అధికారికంగా చేపట్టిందేమి కాదని, ఇంటి యజమాని తమపై అభిమానంతో పిలిస్తే వెళ్లామని అన్నారు. అయినప్పటికీ సర్పంచ్‌ను పిలిచారని.. ఆమె గ్రామంలో లేరని తెలియడంతో ఉప సర్పంచ్‌ నరేందర్‌తో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం చేశామన్నారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, జితేందర్‌ రెడ్డి, జహంగీర్‌, కృష్ణయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, రామయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement