పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

షాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కల సాకారమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల మండల పరిధిలోని పోతుగల్‌ గ్రామంలో కుమ్మరి శోభ, కేశపల్లి చంద్రకళ, అమృత, జంగయ్య, సయ్యద్‌ ఇక్రం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదోడి సొంత ఇంటి కల సాకారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రాంరెడ్డి, సర్పంచ్‌ పామెన నర్సింలు, ఉపసర్పంచ్‌ నేరట్ల సావిత్రి, నాయకులు శ్రీను, రవీందర్‌నాయక్‌, భార్గవరామ్‌, రాజుగౌడ్‌, యాదయ్య, రాజు, మహేందర్‌, వార్డు సభ్యులు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement