షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిలోధిని కాశిరెడ్డిగూడ గ్రామంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సంబరాలను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, వ్యక్తిత్వవికాసం, క్రీడలు, సృజనాత్మకత తదితర అంశాలతో పాటు కరాటేలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి డ్యాగశంకర్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారికి కావాల్సిన వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు వేసవి శిబిరాన్ని నిర్వహించామన్నారు. విద్యార్థికి పుస్తకం చదవడం, రాయడం రావాలన్నారు. ప్రతిభ కనబరిచి విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామలింగంగౌడ్, మాజీ సర్పంచ్ దీనాశంకర్‌యాదవ్, ఉపసర్పంచ్ శ్రీశైలంయాదవ్, పంచాయతీ క్యాదర్శి రాఘవేంద్ర, వార్డు సభ్యులు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


