ప్రజల సహకారం బాగుంది | - | Sakshi
Sakshi News home page

ప్రజల సహకారం బాగుంది

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

శంకర్‌పల్లి: మండల ఎంపీడీఓగా పని చేసిన తనకు శంకర్‌పల్లి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో సహకరించారని ఇటీవల ఉద్యోగోన్నతిపై బదిలీ అయినా జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకయ్య అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేశానని, దానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యకు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి తహసీల్దార్‌ సురేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌, ఎంపీడీఓ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీఓ గిరిరాజు, పలు గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement