కొత్తూరు: ఇటీవల పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ జిల్లాలోనే ఆదర్శవంతమైందిగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాఠశాల హెచ్‌ఎం అంగూర్‌నాయక్‌కు కలెక్టర్ నారాయణరెడ్డి, ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్యాంపులో భాగంగా పర్యావరణ పరిరక్షణ–ప్రజల బాధ్యతపై చేపట్టిన అంశాన్ని అధికారులు గుర్తించినట్లు హెచ్‌ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు భగవంతు, రవికుమార్, రాజు, నవనీత, తదితరులు పాల్గొన్నారు.


