షాద్‌నగర్‌రూరల్: దైవ దర్శనానికి వెళ్లిన ఓ మహిళ పుష్కరిణిలో కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామేశ్వరంలో ఉన్న రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద చోటు చేసుకుంది. వివరాలివీ.. నందిగామ మండలం శ్రీనివాసులగూడ గ్రామానికి చెందిన జన్ముల సువర్ణ (45) ఆదివారం పౌర్ణమి సందర్భంగా రామేశ్వరంలోని దేవాలయానికి దర్శనం నిమిత్తం వచ్చి రాత్రి అక్కడే నిద్రించింది. సోమవారం ఉదయం పుష్కరిణిలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆమె కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


