మొయినాబాద్‌రూరల్: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారమవుతోందనిఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని అమ్డాపూర్‌లో సర్పంచ్ మద్యపాగ కృష్ణ ఆధ్వర్యంలో మొదటి విడతలో లబ్ధిదారులు నిర్మించుకున్న నాలుగు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేవందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోందని తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారులను అభినందిస్తూ సన్మానించారు. గ్రామంలో సమస్యలు ఉంటే సర్పంచ్‌కు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. దివ్యాంగుడు రత్నయ్య ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రభుత్వం ద్వారా ఆయనకు వీల్‌చైర్ ఇప్పించేందుకు కృషి చేయాలని ఎంపీడీఓ హిమబిందుకు సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, కాశీంబౌలి సర్పంచ్ మాడి రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ జితేందర్‌రెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు మన్నె ప్రభాకర్‌రెడ్డి, గుంటం సైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు బాత్కు అంతయ్య, పట్నం రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని అమ్డాపూర్ అంగన్‌వాడీలో టీచర్ సరస్వతి, సర్పంచ్ మద్యపాగ కృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన యూనిఫాంను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల చదువపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి మాడి రాజేందర్‌రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య
అమ్డాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం


