షాద్‌నగర్: ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ అధికారిగా పని చేస్తున్న బన్సీలాల్‌ను చేవెళ్లకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో తలకొండపల్లి ఎంపీడీఓ శ్రీకాంత్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు.
చేవెళ్ల ఎంపీడీఓగా బన్సీలాల్
చేవెళ్ల: చేవెళ్ల ఎంపీడీఓగా పనిచేసిన హిమబిందును మొయినాబాద్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఫరూఖ్‌నగర్ మండల ఎంపీడీఓ బన్సీలాల్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పామెన సర్పంచ్ పామెన రాములు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మొయినాబాద్ ఎంపీడీఓగా హిమబిందు
మొయినాబాద్‌రూరల్: మొయినాబాద్ మండల ఎంపీడీఓగా బిరుదు హిమబిందు సోమవారం బాధ్యతలు చేపట్టారు. చేవెళ్ల మండల ఎంపీడీఓగా పనిచేసిన ఆమె ప్రభుత్వం నిర్వహించిన బదిలీలలో ఇక్కడికి రాగా.. ఇక్కడ ఎంపీడీఓగా 15 రోజులుగా పనిచేసిన వెంకటేశ్వర్‌రెడ్డి యథావిధిగా ఎంపీఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.


