జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

షాద్‌నగర్‌/కొత్తూరు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కొత్తూరు పట్టణానికి చెందిన పాత్లావత్‌ గౌతమ్‌ ఎస్టీ కేటగిరీరిలో 73వ ర్యాంకు సాధించాడు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమైనట్లు విద్యార్థి తెలిపాడు. షాద్‌నగర్‌ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన బడావత్‌ అఖిల 831వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ అరుణ తెలిపారు. కమ్మదనం గురుకుల కళాశాల విద్యార్థులు సభావత్‌ పూజ 2197వ ర్యాంకు, మేక పోతుల ఆదిలక్ష్మి 4388వ ర్యాంకు, కల్లా దీపిక 4657వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ శారద చెప్పా రు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement