నిరుపేదల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

నిరుపేదల సంక్షేమమే ధ్యేయం

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

షాద్‌నగర్‌రూరల్‌: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని హజిపల్లి, మొండోనిరాయితండా, చించోడ్‌ గ్రామాలతో పాటుగా పట్టణంలోని 12, 15 వార్డులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్లను ప్రాంభించి, అబ్ధిదారులకు వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని, దీంతో పేదల కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించి వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేను సన్మానించి, స్వీట్లు తినిపించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గనూర్‌ బస్వం, వైస్‌ చైర్మన్‌ అందె మోహన్‌, కమిషనర్‌ సునీత, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

Advertisement
 
Advertisement
Advertisement