నూతన ఎంపీడీఓ శ్రీరామ్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

నూతన ఎంపీడీఓ శ్రీరామ్‌కు సన్మానం

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

కొందుర్గు: కొందుర్గు మండల ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్‌ను కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఇదివరకు ఇక్కడ ఎంపీడీఓగా పనిచేసిన లక్ష్మిఅనురాధ డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొంది రాజేంద్రనగర్‌ టీజీఐఆర్‌డీకి బదిలీపై వెళ్లారు. ప్రస్తుత సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ఎంపీడీఓగా పనిచేస్తున్న శ్రీరామ్‌ ఇక్కడికి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా కొందుర్గు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేఖ ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌కు బదిలీపై వెళ్లారు. షాబాద్‌ మండలం కేశవగూడ నుంచి రమేశ్‌ కార్యదర్శిగా బదిలీపై ఇక్కడికివచ్చారు. అదేవిధంగా అలాగే చిన్నఎల్కిచర్ల కార్యదర్శిగా రాకేశ్‌, ఉమ్మెంత్యాల యాదయ్య, టేకులపల్లి మల్లేశ్‌, తంగెళ్లపల్లి పర్వీన్‌ బేగమ్‌, గంగన్నగూడ సయ్యద్‌ పాషా, ఉత్తరాసిపల్లి విజయభాస్కర్‌రెడ్డి, పర్వతాపూర్‌ అరుణ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement