సర్వేను పారదర్శకంగా రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

సర్వేను పారదర్శకంగా రూపొందించాలి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

తుర్కయంజాల్‌: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిబట్ల సర్కిల్‌ డిప్యూటీకమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఇంజాపూర్‌లో బీఎల్‌ఓలు, పలుపార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మట్లాడారు. అర్హులు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో, లేదో పరిశీలించుకోవాలని, లేకపోతే నమోదు చేయించుకోవాలని సూచించారు. తప్పులు ఉంటే సరిచేయించుకోవాలన్నారు. మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లను తొలగింపునకు వారి బంధువులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బీఎల్‌ఓలకు సహకరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement