ఇబ్రహీంపట్నం రూరల్: యాచారం మండలంలో పలువురు అధికారులు బదిలీకాగా.. వారి స్థానంలో కొందరు కొత్తవారు వచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ శైలజ కడ్తాల్ మండలానికి వెళ్లగా.. అమె స్థానంలో కడ్తాల్ నుంచి మహాలక్ష్మి వచ్చారు. సీనియర్ అసిస్టెంట్ కృష్ణ జెడ్పీకి, జూనియర్ అసిస్టెంట్ మహేందర్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి, మేడిపల్లి పంచాయతీ కార్యదర్శి తిరుపతి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడీపల్లికి బదిలీ అయ్యారు. మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు నందిగామకు, యాచారం పంచాయతీ కార్యదర్శి కిషన్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బలిజగూడకు, చౌదర్‌పల్లి పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న పిగిలిపూర్‌నకు, తమ్మలోనిగూడ పంచాయతీ కార్యదర్శి అశోక్.. కడ్తాల్ గోవిందపల్లికి వెళ్లారు. త్వరలో మరికొందరు బదిలీ కానున్నట్లు సమచారం.
శంకర్‌కు దివ్యాంగుల సన్మానం
ఆమనగల్లు: యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు బొడ్డు శంకర్‌ను ఆ సంఘం నాయకులు సన్మానించారు. పట్టణంలోని ఫంక్షన్‌హాలులో సోమవారం జరిగిన శంకర్ అభినందన సభలో సత్కరించి అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన శంకర్‌కు డాక్టరేట్ వరించడం హర్షణీయమన్నారు. సంఘం నాయకులు వెంకటేశ్, మల్లికార్జున, వెంకటయ్య, సత్యనారాయణగౌడ్, కృష్ణ, చెన్నకేశవులు, కొండల్, ఆనంద్, రజియ, అలివేలు, అమృత, కలమ్మ పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత
కడ్తాల్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని సర్పంచ్ రాయికంటి భిక్షపతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాలనీల్లో పర్యటించారు. బీసీ కాలనీలో రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో కూరగాయల వ్యాపారులు చెత్త, వ్యర్థాలు వేయడం గమనించి, వాటిని పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపచేశారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని, క్రయవిక్రయాల అనంతరం చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్‌లో వేయాలని వ్యాపారులకు సూచించారు.
మాస్కుల పంపిణీ
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీ సిబ్బందికి తగిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తానని మల్కీజ్‌గూడ సర్పంచ్ డేరంగుల శంకర్ అన్నారు. సోమవారం గ్రామంలో కార్మికులకు మాస్కులు, గ్లౌజులు అందజేశారు. బీజేపీ నాయకు లు నగేష్, రవీందర్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
కడ్తాల్: సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారికి కార్పొరేట్ వైద్యం అందేందుకు సహాయపడుతుందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన జూలూరి వీరమణికి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.42 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితురాలికి చెక్కు అందజేశారు. కోఆప్షన్ మాజీ సభ్యుడు జహంగీర్‌బాబా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, సోషల్‌మీడియా కన్వీనర్ రమేశ్, శరథ్ ఉన్నారు.


