ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుందని నాగన్‌పల్లి సర్పంచ్ యాదగిరి అన్నారు. సోమవారం గ్రామంలో లబ్ధిదారు ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండో విడతలో లబ్ధిచేకూరుతుందని పేర్కొన్నారు. బీసీలకు రూ.5లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలు ఇందిరమ్మ రుణ సాయం అందిస్తామని చెప్పారు. మలి విడతలో గ్రామానికి 50 ఇండ్లు కావాలని ఎమ్మెల్యేను కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ జంగయ్య, వార్డు సభ్యులు దారుశరత్‌రాయుడు, కాటం రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నారగారి నర్సింహ, పెద్ద నర్సింహ, కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం
అబ్దుల్లాపూర్‌మెట్: నిరుపేదలకు వరం ఇందిరమ్మ ఇళ్లు అని సర్పంచ్ కోటా ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి పిగ్లీపూర్ గ్రామంలో లబ్ధిదారులు పంది మంజుల రాము, పోలే రజిత దర్శన్‌ల ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన బండలు సొంత ఖర్చుతో వేయించానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం నరసింహ, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, ఝాన్సీ ఆంజనేయులు, లావణ్య హనుమంతు, పరమేష్, మురళీకృష్ణ, రమేష్, హరిణి మహేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు హుస్సేన్, ఎర్రయ్య, అమరావతి, శ్వేత, హారిక, దేవాదాయ కమిటీ చైర్మన్ ఐలయ్య పాల్గొన్నారు.


