ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వ ఆలోచన మంచి పరిణామని, జిల్లాలో పనిచేస్తున్న వారికి అక్కడే స్థలం ఇవ్వాలని టీడబ్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని వి.వి.ఎంబ్యాంకెట్‌హాలో ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడు గణేశ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు. హెల్త్‌ కార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులో రాయితీ ఇచ్చేలా కలెక్టర్లు, డీఈఓలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో టీడబ్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శేరిబాయి గణేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, కోశాధికారి శ్రీనివాస్‌ చారి, నేషనల్‌ కమిటీ సభ్యుడు దేవేందర్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.వెంకటేశ్‌, మణికుమార్‌, రఘునంద గౌడ్‌, శ్రీనివాస్‌, నర్సింహ్మ, రాజశేఖర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు యాదగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి నర్సింహ్మారెడ్డి, సోషల్‌ మీడియా కమిటీ కన్వీనర్‌ శివ కుమార్‌ గౌడ్‌, జిల్లా కమిటీ సభ్యులు శ్రీశైలం, అంజి, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, రఘవేందర్‌ గౌడ్‌, రాజు, జైచందర్‌, శంకర్‌, బుచ్చయ్య, జర్నలిస్టులు మల్లేశ్‌, యాకుబ్‌ పాష పాల్గొన్నారు.

టీడబ్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య

Advertisement
 
Advertisement
Advertisement