ఆమనగల్లు: తలకొండపల్లి ఎంపీడీఓగా సీతారావమ్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన శ్రీకాంత్.. జిల్లాలోని ఫరూక్ మండలానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్‌జిల్లా టేక్మాల్‌లో పనిచేస్తున్న సీతారావమ్మ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కార్యాలయ సిబ్బంది సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆలయానికిమకరతోరణం బహూకరణ
ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి మండలానికి చెందిన అమృతం భాగ్యలక్ష్మి ప్రకాశం స్వామివారికి మకరతోరణం, నాగాభరణం బహూకరించారు. సోమవారం ఆలయ నిర్వాహకుల సమక్షంలో స్వామివారికి మకరతోరణం అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత దంపతులను స్థానికులు అభినందించి సత్కరించారు. సర్పంచ్ కటికల శేఖర్‌యాదవ్, నాయకులు పాండుయాదవ్, రవినాయక్, రవి పాల్గొన్నారు.
ఎంపీడీఓగా జయరాం విజయ్
ఆమనగల్లు: ఆమనగల్లు ఎంపీడీఓగా జయరాం విజయ్ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన కుసుమమాధురి.. కొంత కాలం క్రితం వికారాబాద్ జిల్లా డీఆర్‌డీఓ విజిలెన్స్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. దీంతో నాటి నుంచి తలకొండపల్లి ఎంపీడీఓ శ్రీకాంత్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న జయరాం విజయ్.. ఇక్కడికి బదిలీపై వచ్చారు. పూర్తి స్థాయిలో మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు.


