త్రివిధ దళాలకు వికారాబాద్ జిల్లావాసుల ఎంపిక
నాలుగేళ్లపాటు దేశ సేవ చేసేందుకు భారత సైన్యంలో ప్రభుత్వం అగ్నివీర్ యోజన ప్రారంభించింది. ప్రవేశాలకు గతేడాది రాతపరీక్ష ఫలితాలను ఆదివారం ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.
హస్నాబాద్ నుంచి ఐదుగురు
దుద్యాల్: మండల పరిధిలోని హస్నాబాద్, పోలేపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు అగ్నీవీర్(ఇండియన్ ఆర్మీ)కి ఎంపికయ్యారు హస్నాబాద్ నుంచి కక్కునూరి సాయితేజ, కొత్త అశోక్, బొంగు రాకేశ్, నాయుకోటి నవీన్, తూర్పు హన్మంతు, పోలేపల్లికి చెందిన పుర్ర హరికృష్ణ దేశసేవకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యువకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఐనాపూర్ నుంచి ఏడుగురు
దోమ: కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన అగ్నీవీర్‌కు ఆయా గ్రామాల యువకులు సత్తచాటారు. ఐనాపూర్ గ్రామం నుంచి ఏడుగురు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పి.శ్రీనివాస్, పవన్‌కుమార్, దేవ, భరత్‌యాదవ్, మునీ, పి.నరేశ్, భాను ప్రకాశ్ అగ్నీవీర్‌కు ఎంపికయ్యారు. బొంపల్లి గ్రామం నుంచి బోయిని వంశీముదిరాజ్ అగ్నీవీర్‌కు ఎంపికయ్యారు.
కుల్కచర్ల నుంచి
14 మంది ఎంపిక
కుల్కచర్ల: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రవేశాల్లో 14 మంది యువత అర్హత సాధించారు. బండవెల్కిచర్ల నుంచి మొగులయ్య, కాశమోని నవీన్, మడుగు రామకృష్ణ, చిగుర్లపల్లి అనిల్, కోట్ల సాయి, పిల్లి శ్రీకాంత్ సాల్వీడు నుంచి జోగు శేఖర్, దీప్లానాయక్ తండా నుంచి కుమార్, ఘణపూర్ గ్రామానికి చెందిన బిజ్జారం శివకుమార్, కొండ శివకుమార్ బిందెంగడ్డ తండా నుంచి సునీల్, కుల్కచర్లకు చెందిన గుడాల అఖిల్, చెరువుముందలి తండా(ఎ) నుంచి రాహుల్, పుట్టపహాడ్ గ్రామానికి చెందిన ప్రకాశ్, చౌడాపూర్ మండలం రాంసింగ్ నాయక్ తండాకు చెందిన విస్లావత్ మేఘనాథ్ అగ్నివీర్‌కు ఎంపికయ్యారు.


